Monday 24 December 2012

" మహిళను " గౌరవించే వానిని --ఒక్కరిని చూపించు --చూడాలని ఉంది --?

నాదో కోరిక --
నాదో తపన -
నాదో అన్వేషన --
ఊహ తెలిసిందగ్గర నుంచి -ఏదో ఆరాటం -
' అతన్ని ' చూడాలని --
ఒక్కసారి -
ఒకే ఒక్కసారి --మాటలాడాలని -
ఎం లాభం ?
ఇంతవరకు కనిపించలేదు -
ధివి నడిగా --భువి నడిగా
దిక్కు నడిగా --చుక్క నడిగా
పక్క నెల్లే పైరగాలి నడిగా
బడిలో గురువు నడిగా
గుడిలో పూజారి నడిగా ,
నాన్న నడిగా --నానమ్మనడిగా
తెలియదన్నారు --చూడలేదన్నారు ,
ఏం లాభం --నా తపన తీరలేదు !
రామాయణం -చూసా --కనిపించలేదు /
భాగవతం చదివా --కనిపించలేదు ?
భారతం చదివా --ఊహూ --కనిపించలేదు
చరిత్రకారున్ని అడిగా --మేధావులనడిగా
తెలియదన్నారు --చూడలేదన్నారు !?
దేవుళ్ళలో లేడు --దేవతలలో లేడు
మునులలో లేడు -- మానవులలో లేడు
ఎవడమ్మా ? వాడు -- ఎక్కడుంటాడు ?
ఎలా ఉంటాడు ?
మహిళను గౌ రవించేవాడు --
ఎప్పుడూ --ఎక్కడా --ఒక్కసారైన
అనుమానించనివాడు --అవమానించనివాడు
కసురుకోని వాడు -- విసుక్కోనివాడు -
కొట్టని వాడు --తిట్టని వాడు -
చూపిస్తావా ? అల్లాగే --
ఆదరించేవాడు --ఆరాధించేవాడు
లాలించే వాడు --పాలించే వాడు
" రక్షణ" గా నిలిచేవాడు -
" మహిలో "
ఒక్కడ్ని --చూపించు --
ఒక్క సారి --ఒకే ఒక్క సారి చూపించు -!

10 comments:

  1. కళ్ళు తెరచి అహంకారపు పొరలు తొలగించి చూడండి కనపడతారు ఒక తండ్రి ...ఒక అన్న... ఒక తమ్ముడు..............

    ReplyDelete
    Replies
    1. మన్నించాలి ,ఇది ఎవరిని కించపరచాలని రాయలేదు ,ఇక నాది అహంకారం ఎంత మాత్రం కాదు
      నాది ఒక ఆవేదన ,ఒక ఆశ ,పరిపూర్న వ్యక్తిత్వం కోసం నా అన్వేషన ,నాకు కూడా అన్నయ్యలు ,అక్కలు ,తమ్ముల్లు ఉన్నారండి ,అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి ,థాంక్స్

      Delete
  2. మా కుటుంబంలో ౭ గురు అన్నదమ్ములు ఉన్నారు ౭ గురు అక్కాచేల్లెల్లకు.
    మా నాన్నగార్లు ౭ గురు మరియు మా నాన్నగారి మేనత్త పిల్లలు, ఇంకా కావాలి అంటే ఒక్కసారి మా ఊరు రండి.

    ReplyDelete
    Replies
    1. ఫనీంద్ర గారూ ,మాదీ ఉమ్మడి కుటుంబమే ,అయితే నా అన్వేషన వేరు ,అనురాగాలు ,ఆత్మీయతలు ,అనుభందాలు అన్నీ నాకు తెలుసు ,అయితే నా ప్రయత్నమంతా క పరిపూర్న వ్యక్తిత్వం కోసం అని చెప్తున్నాను ,దయచేసి అర్ధం చేసుకుంటారని భావిస్తూ మీకు నా
      ధన్యవాదములు

      Delete
  3. ఇలా వ్రాసినందుకు తప్పుగా అనుకోకండి.

    రోబోట్స్ అయితే మీరు అనుకున్నట్లు ఉండవచ్చు.

    జీవితంలో ఎవరినీ ఎప్పుడూ విసుక్కోని, కసురుకోని, తిట్టని, ఒక్క స్త్రీని నాకూ చూడాలనుంది.

    మీరు పుట్టినప్పటినుంచి ఇప్పటి వరకు ఒక్కసారైన ఎవరినీ విసుక్కోలేదా ? కసురుకోలేదా ? తిట్టలేదా ?

    కొందరు స్త్రీవాదులనబడే వాళ్ళ రచనలు వాస్తవానికి దూరంగా ఊహాలోకంలో విహరింపజేస్తాయి. నిజ జీవితంలో ఎవరూ మీరు అనుకున్నట్లు ఉండరు. కధల్లోను, రచనల్లోనూ ఉండే ఊహాజనిత పాత్రలు మాత్రమే ఇలా ఉంటాయి.
    .................

    ఆది దైవం పరిపూర్ణులు. దైవం మీరు ఊహించినదానికన్నా అంతులేని గొప్ప సుగుణాలున్నవారు.
    ...................

    అయితే, మనిషి జన్మ ఎత్తిన తరువాత అవతారపురుషులైనా మానవవ్యక్తిత్వాన్ని ప్రకటిస్తారు.

    ( అందుకు కొన్ని కారణాలున్నాయి. సమాజంలో వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో పురాణేతిహాసాలలోని పాత్రల ద్వారా మనకు తెలుస్తుంది. )

    ReplyDelete
    Replies
    1. చాలా థాంక్స్ అండీ ,మీ వివరణ నచ్చింది ,

      Delete
  4. మగవాళ్ళంతా చెడ్డవాళ్ళు అనడం, ఆడవాళ్ళంతా మంచివాళ్ళనంత పెద్ద అబద్ధం.

    ReplyDelete
    Replies
    1. ప్రేరన గారూ ముందుగాఅ ధన్యవాదములు ఎందుకంటే నా బ్లాగ్ ని సందర్సించినందుకు ,ఇక పోతే
      మగవాల్లంతా చెడ్డ వాళ్ళు అని గానీ ,ఆడవాళ్ళు మంచి వారని అనలేదు ,ఇది ఎవరినీ విమర్సిస్తూ వ్రాసింది కాదు ,నా ప్రపంచం లో ఎప్పటికైనా ఒక పరిపూర్న వ్యక్తిత్వాన్ని చూడగలనా లేనా అనే తపన మాత్రమే ,అర్ధం చేసుకుంటారని భావిస్తూ ..

      Delete
  5. వెతకండి. తప్పకుండా కనిపిస్తాడు. విశ్వం చాలా విశాలమైంది.

    ReplyDelete
  6. chaalaa chaalaa baavundi...manchi vaallu untaru

    ReplyDelete