Sunday 22 September 2013

శ్మశానం ముందు ముగ్గు ఉండదు --రాజకీయ నాయకుడికి సిగ్గు ఉండదు ? ( మన రాజకీయ నాయకులకు ' నార్కో ' పరీక్ష చేస్తే వాళ్ల మనసులో మాటలు ఇలాగే ఉంటాయేమో కదా ?ఒక్కసారి చదవండి )

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ --అ
ప్రజాస్వామ్యం గా దేశాన్ని దోచుకుంటున్న --మేము
ఏలికలం --పాలకులం ---నాయకులం
రత్నగర్భని రాళ్ళగర్భ గా చేసాం --చేస్తున్నాము -
పగటి  వేషగాళ్ళం --పూట కో వేషం వేస్తాం
చేటు చెయ్యని ప్రజలను --చీట్ చేస్తాం --చేస్తున్నాం
                రాజకీయ శ్మశానం లో కాటికాపరులం
                నిజాయితీ లేని బూతు దేవుళ్ళం
                శవాలతో వ్యాపారం చేసే మగధీరులం
                పాపాల భైరవులం -అధికార దాసులం
కర్మ సిద్దంతమంటూ ధర్మానికి నిలిచే ప్రజలను
నర్మభాషణ్లతో మోసం చేస్తాం
ఎలక్షన్ల కుంభమేళాలో -కులమతాలే పెట్టుబడిగా
ఆల్ ఫ్రీ --టోల్ ఫ్రీ అంటూ కలక్షన్లు చేస్తాం
               అన్నార్తుల ఆకలికేకలు --ఆర్తనాదాలు --మాకు హిందోల రాగాలు
               అబలల ఆక్రందనలు --నిరుద్యోగుల ఆవేదనలు మాకు భూపాల రాగాలు
               రక్త పాతాలు --బందు ల భాగవతాలు -మా నాటకాలు --వ్యాపకాలు
              రిక్త హస్తాలతో నిలుచున్న భారతి సహనానికి మా దోపిడీలే నిదర్సనాలు
వినాశనం మా వికాసం --వంచన మా ఆదర్సం
లంచం మా ఆశయం మోసం మా నినాదం
అన్యాయం మా కానందం --అవినీతి మా వేదాంతం
కులమతాలా మా కడ్డంకం --కుంభకోణం మా ప్రాణం
అధికారం కోసం --' ఆంధ్హ్రా ని ' విడగొడతాం --భారతాన్ని పడగొడతాం
రంగు రంగుల జెండాల --ఊసరవెల్లులం -మేమంతా
భారతిని పంచుకుంటాం గాని --అమ్మం ,
ప్రజాస్వామ్యపు --రెడ్ లైట్లో --లైటు లేని భారతికి --మేమే --మేమే
సెర్చ్ లైట్లం --టార్చి లైట్లం --ట్యుబ్ లైట్లం
స్వరాజ్య భారతి --సోదరులం --స్వతంత్ర భారతి వారసులం
మేమే --ఏలికలం --పాలకులం --నాయకులం
---------జై హింద్ --

Sunday 25 August 2013

చీరలు కట్టి -- చీర విలువ --పవిత్రతా పాడు చేయకండి --అలా చేసి మహిళ ల ను కించపరచకండి .ఉద్యమ కారులకు ఒక విన్నపం .

ఏ రోజున ఆంధ్ర ప్రదేష్ ను రెందుగా తెలంగాణా --సీమాంధ్ర పేరుతో విభజిస్తున్నామని కాంగ్రేసు ప్రకటించిందో -
ఆ రోజు నుంది సీమాంధ్ర లో సమైక్య రాష్త్రం కోసం ఉధ్యమాలు ప్రారంభం అయ్యాయి -వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా
అన్ని వర్గాల వారు ఉధ్యమం లోకి అడుగు పెట్తి తెలుగు తల్లి ని రెండుగా చీల్చవద్దని ఆందోలనలు చేస్తున్నారు
 ,ఉపాధ్యాయులు ,వర్తకులు ,కార్మికులు కర్షకులు ,అందరూ ముక్యం గా విద్ యార్ధులు ,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ,ఆంధ్ర ప్రదేష్ ని విడకొట్టవద్దని రోడ్ల మీదకు వచ్చారు .
అయితే --అంతవరకు బాగానే వుంది
ప్రజల్ని మోసం చేసి అధికారం కోసం డిల్లీ నడివీధిలో తెలుగు జాతి ఆత్మ గౌవరాన్ని తాకట్టు పెట్టి ,దొంగల లా తిరుగుతున్న కొందరి రాజకీయ నాయకులకు ముక్యంగా --కావూరి సాంబసివరావు ,చిరంజీవి అనే చిన్న జీవి కి
చెతికి గాజులు ,చీరలు కట్టి వాల్ల ఫ్లెక్షీ లు ఏర్పాటు చేసారు .అకాడా బాధ అనిపించ లేదు --కానీ
చీర కట్టేసి వాల్లను చూపించడం నాకు న్చ్చలేదు ఎందుకంతే ?
ఆడవాళ్ళు , వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది ,మగవాల్లకు ఒక ప్రత్యేకత ఉంది
ఈ ఉధ్యమం లో క్రియాశీలక పాత్ర పోషించి జాతి గౌవరాన్ని చాటారు -అంతేకాదు ఈ ఉధ్యమం లో కుక్కాలు ,పందులు ,గాడిదలు ,గంగిరెద్ద్లు ,గుర్రాలు ,ఒంటెలూ కూడా తమ వంతు పాత్ర పోషించాయి
చివరకు మష్టివాల్లు కూడా పాల్గొన్నారు .అంతేకాదు హిజ్రాలు (క్షమించాలి ,వాల్లని కించపరచలేదు ,అది నా అభిమతం కాదు )తెలుగుజాతి సమైక్యం గా ఉండాలని ఎలుగెత్తి నినదించారు
ఒక్క సీమాంధ్ర మంత్రులు తప్ప --వాళ్ళని మహిళలతో పోల్చలేము ? పురుషులతో పోల్చలేము ?జంతువులతో పోల్చలేము ,హిజ్రాలకున్న భాద్యత  ,కర్తవ్యాని తోనూ పోల్చ లేము
వీళ్ళ ని ఏమని పోల్చాలి ?ఏ విధం గా అర్ధం చేసుకోవాలి ? నాకు అర్ధం కావడం లేదు .
సిగ్గు లజ్జ లేని వీళ్ళ కు చీరలు కట్టి చీర విలువ తియ్యవద్దని మనసారా వేడుకుంటున్నా >


మేధావులారా --మౌనం వీడండి --మీరు మాటలాడాలి -మీ మాటలు --' భారతి ' కి ఇప్పుడు ఎంతో అవుసరం .

200 సుధీర్గ పోరాటం తరువాత -
స్వాతంత్ర్యం వచ్చింది ? ఎవరికి ?
ప్రజలకా / పొలిటీషియన్లకా ?
రాత మారని ప్రజలకా ? రాజ్య మేలుతున్న రాజకీయాలకా ?
బాగు పడిందెవరు ? లాభ పడిందెవరు ?
భాధలలో ఉన్నదెవరు / బానిసలుగా మారినదెవరు ?
అధికార దాహం తో --కుల ,మతాల ,పెట్టుబడితో
అందలం ఎక్కి --విభజనలు --విద్వేషాలు పుట్టించి
ప్రజలకు ద్రోహం చేస్తున్నదెవరు ?
ఇదేనా ప్రజా స్వామ్యం / ఇదేనా స్వరాజ్యం ?
ఒక్కసారి ఆలోచించండి --
66 సంవస్త రాలలో -
66 కుంభకోణాలు --
200 ఏళ్ళలో బ్రిటీషు వాళ్ళు దోచుకున్నది ఎంత ?
స్వరాజ్య భారతం లో భారతీయులు దోచుకున్నదెంత (రాజకీయ నాయకులు )
ఇంచుమించుగా ---910,603,234,300,000 కోట్లు
అదే us dollar  లో అయితే --20.23 trillions aTa
 ఈ సొమ్ము తో దేసం లో అన్ని సాంఘీక సమస్యలన్నీ తీర్చేయవచ్చు
పేదరికం పూర్తిగా నిరూలించవచ్చు ,నిరుద్యోగం లేకుండా చెయ్యవచ్చు ,
అంతే కాదు రాత్రికి రాత్రి ఈ దేశాన్ని సూపర్ పవర్ గా మార్చవచ్చు
ఎంత దోచుకున్నారో చూడండి
ఇంకా మనం ,మేధావులు మౌనం గా ఉంటే ఎలా గ /
ఆలోచించండి --
all scams since 1947 --courtesy by paresh ratan kundu
scams will be published tomarow

Monday 12 August 2013

ఇదేదో శవం లా ఉందే --? శవమే --ఎవ్వరిదీశవం --?

అర్రర్రే---
ఇదేదో శవం లా ఉందే --
శవం లా ఉండటమేంటీ -శవమే -
అయ్యయ్యో --
ఎండకు ఎండి --ఎండీ --బిగుసుకుపోయినట్లు ఉంది
వానకు తడిసి --తడిసీ --వు బ్బిపోయినట్లు ఉంది
బట్తలు చివికిపోయాయి --
బోర్లా పడుందేమో --పోల్చుకో కుండా ఉంది
ఇంతకీ --ఈ --శవం --ఆడదా ? మగదా?
ఎవ్వరిదీ శవం --్
విధ్యర్ధి దా --విధార్ధినిదా ?
ఉగ్రవాదిదా --? ఉద్యమకారునిదా ?
నిజాలు మాట్లా డే వాడిదా --ఇజాలు చెప్పేవాడిదా ?
నక్షలైటుదా --నాయకుడిదా ?
ఎవ్వరిదీ --శవం -
అయ్యబాబోయి --కొంపమునిగింది --ఇప్పుడేమి చేయడం ?
ఈ శవం --సరిగ్గా --ఆంధ్రా --తెలంగాణా --సరిహద్దుల్లో పడివుంది -
అయ్యా --పేపరువాల్లు --పోలీసులూ --రండి --
రిపోర్టర్లు --చానల్లవారూ రండి --రండి --
పరిశీలించండి --బాగా చూడండి -- ఎవరిదో అడగండి --
విధ్యార్ధినీ విధ్యార్ధులైతే --' కార్పొరేటు కాలేజీల నడగండి '
ఉగ్రవాది దైతే --పాకిస్తాన్ని అడగండి --
ఉధ్యమకారునిదైతే ---కే సి ఆర్ ని అడగండి --కాంగ్రేసు ని అడగండి 
o u  అయితే కోదండరాము ని అడగండి --a u  అయితే లగడపాటి ని అడగండి 
నిజాలు మాటలాడే వాడిదైతే --పౌరహక్కుల వాల్లను అడగండి 
ఇజాలు మాటలాడే వాడైతే --కమ్మూనిస్ట్లను అడగండి -
నక్షలైటుదైతే పోలీసులను అదగండి 
 నాయకుడిదా -? వాడెందుకు చస్తాడు --చంపుతాడు లేదా --చచ్చేలా చేస్తాడు 
మరి ఎవ్వరిదీ శవం --
నీతి తప్పిన ప్రజాస్వమ్యానిదా --
శ్రుతి మించిన అధికార దాహానిదా 
గతి తప్పిన ప్ర్గగ తి దా --మతి పోయిన మానవత్వానిదా --లేక 
రాజకీయ ' రెడ్ లైట్ లో ' ఆందోలనలతో --అల్లర్లతో -
నలిగి --నలిగి -- విసిగి --విసిగి --
ఆత్మార్పణం చేసుకున్న --ఆంధ్రునిదా --'  ఆంధ్ర మాతదా ' 
ఎవరిదీ శవం --చెప్పండి --

Monday 29 July 2013

చితి మంటల వెలుగులో ----అభి " మాన " భంగమే ? (అమ్మ , అక్క ఏడుస్తుంటే --నన్ను ఎవరు ఓదారుస్తారు ?

హమ్మయ్య --:
ఓ సమస్య తీరింది
మొత్తానికి
అనుకున్నది జరిగింది
' తాంబూలాలు ' ఇచ్చేసాము ---ఇక
తన్నుకు చావండి =
సరిగ్గా ---66 సం =రాల క్రితం
ఇలాగే -- ఈ విధంగానే
" అమ్మ ' ని
ముక్కలు --ముక్కలు గా చేసేసారు
పంచుకున్నారు --కావలసిందంతా
దండుకున్నారు
అమ్మ ముసలి ది అయిందని కాబోలు --ఇప్పుడు
అక్కని --ఎంచుకున్నారు
చక్కగా --చీల్చేస్తున్నారు ,
గంగా -గోదావరి కన్నీల్లు  ఎవరికి కావాలి
హృదయ  మైదానాలు మాత్రం కావాలి
అమ్మయినా --అక్కయినా --వారి కి ఎందుకు ?
ఆస్తి --అధికారమే వారికి కావాలి
అమ్మా --ఏడవకే
అక్కా ఎడవకే --
నాన్న లేడనే కదా వాళ్ళు విర్రవీగుతున్నారు --( ఆలోచించేవాడు )
అన్న రాడనే కదా వాళ్ళు --రెచ్చిపోతున్నారు --( ఆవేశపడేవావాడు )
బ్రతికుండగానే --పోస్తు మార్టం చేస్తూ
చితి వెలుగులో ---చిద్విలాసం గా --పా్ర్టీ చేసుకుంటున్నాడు
మతి పోయి --భారతి --మౌనంగా
గతి లేక --అన్నపూర్ణ --ఆవేదనగా
జాతి మొత్తం --జవజీవాలు కోల్పోతున్న
పట్టించుకోకుండా
ఓట్ల కోసం ---సీట్ల కోసం --నోట్ల కోసం
పదవి కోసం --పరువు కోసం --పంతం కోసం
హృదయ శిధిలాల మీద నడచుకుంటూ వెళ్ళిపోతున్నాడే
వారిని ఏమని పిలవాలి ? ఎం అనాలి ?
ఏ జాతి వాడని అదగాలి ? " నాలుగో " జాతి అందామా ?
లేక మనం నోరు మూసుకుందామా ?
మరేమి చెయ్యగలం ?
కళ్ళున్న గుడ్డివాళ్ళం ---చెవులున్న చెవిటి వాళ్ళం
నోరున్న మూగ వాళ్ళం --బలమున్న --బలహీనులం్
చదువున్న నిరక్ష్య రాసులం -- వెరసి 
ప్రజాస్వామ్యం లో ---
ఓడిపోయిన ఓ ట రు లం --.

Tuesday 29 January 2013

తల్లి కి రోజూ నమస్కారం చేస్తే --ఎంతో పుణ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి --!

" భూ ప్రదక్షిణ షట్కేన కాశీ యాత్రా యుతేన చ !
సేతు స్నాన శతైర్యచ్చ్ తత్ఫలం మాత్రువందనే !
భావం : తల్లికి నమస్కారం చేసినంత మాత్రాననే ,ఆరు సార్లు భూ ప్రదక్షిన చేసిన ఫలం లబిస్తుంది ,వేయి సార్లు
కాశీ యాత్ర కు వెల్లిన పుణ్యం దక్కుతుంది ,వందసార్లు సముద్ర స్నానం చెసిన ఫలితం దక్కుతుంది .