Wednesday 19 December 2012

మానవుడిగా జన ణం ---మృ గం లా జీవితం ---{నేటి మనిషి జీవన ప్రస్తానం }

పాశ్చాత్య ప్రభావమా--? అధునిక శాస్త్ర --అగ్నానమా ?
మితి మీరిన ఆత్మవిస్వాసమా--?
అతిగా మారిన --చిత్తచాంచల్యమా ?
" మనిషి " గా బ్రతకాల్సినవాడు -
" మృ గం " లా మారిపోయాడు ,
అరువు తెచ్చిన ఆవేశం తో -మానవత్వపు
పరువు తీసి తెగ రెచ్చిపోతున్నాడు
ఉత్ప్రేరకాలతో జీవిస్తూ--
ఉద్రేకాలతో బ్రతుకుతూ --ఉన్మాదిగా మారాడు !
ఎం చెప్పను --ఎలా చెప్పను ?
జీవన విధానం పూర్తిగా మారిపోయింది -
బ్రతుకు కోసం నిత్యం -' ఫైటింగ్ '--మెషిన్లా ' రన్నింగ్ '
మెతుకు కోసం ' సెర్చింగ్ ' --మనసం మాత్రం --' కన్నింగ్ '
రోజూ---
సైబెర్ కెఫె లో --' లివింగ్ ' --షాంపెఇం సేవింగ్ -
రాత్రుళ్ళు విలాసాల -' రోమింగ్ ' --అందుకై --
ఇల్లీగల్  ఎర్నింగ్ ----ఎవ్విరిథింగ్ ' చీటింగ్ '
ట్వెంటీ ఫస్ట్ సెంచరీలో --సాంప్రదాయం --' ట్రాష్ '
కప్పుకోవడం -వేస్ట్ -- విప్పుకోవడం --బెస్ట్ -
పార్కుల్లో పలకరింతలు --పబ్ లో పులకరింతలు
' ఆరుబైట ' " అమ్మతనం " --ఆపసోపాలు పడుతుంటే -
అపచారం అనకు --ఆచారం -నేటి యువతకు
కాల్ సెంటర్ల  పుణ్యమాని -
కట్నాల -సేల్ తగ్గింది --కానీ --
" కన్నెధనమే " --ఫ్రీ గూడ్సుగా మారింది
దోచుకునేవాడిదే ఇస్టం --దాచుకోనివాడిదే కస్టం
" స్వేచ్చ్ " మితిమీరింది --ఆక్రమార్జనకు అంతే లేదు
అవ్వ ---ఆలి --అమ్మి --ఎవరైనా ఒకటే --" వేల్యు డిఫ్ఫెర్స్ "
ఆడదానికోసం ముందులా --" కిరోసిను " --వాడటం లేదు -
టెక్నాలజీ పెరిగింది --టెక్నిక్ తెలిసింది --
" ప్రాణం " విలువ ఎంతని ?--
ఓ బస్సు జర్నీ --ఓ యసిడ్ దాడి --తప్పితే
ఓ మానభంగం --మానవత్వపు హననం --
ఇదీ  జీవితం --ఇంతే జీవనం --


6 comments:

  1. tappakunda pampimchavachhu maaku...email: bharatiyulam@gmail.com

    chala bagunayi me blog posts.

    ReplyDelete
    Replies
    1. చాలా ధన్యవాదములు మహేంద్రగారూ ,ఇకనుంచి క్రమం తప్పకుండా పంపించేందుకు ప్రయత్నిస్తాను ,నా బ్లాగ్ ని సందర్సించి నందుకు మరొక్కసారి ధన్యవాదములు

      Delete
  2. Replies
    1. వెన్నెలగారూ చాలా చాలా ధన్యవాదాలు ,చాలారోజులుగా బ్లాగ్ కి దూరం గా ఉన్నాను ,ఇదిగో నిన్ననే మల్లీ వచ్చాను ,ఇకనుంచి క్రమం తప్పకుండా వ్రాస్తాను లెండి ,

      Delete
  3. చాలా బాగా వ్రాసారండి.

    ReplyDelete
    Replies
    1. చాలా థాంక్స్ అండీ నా బ్లాగ్ ని సందర్సించినందుకు

      Delete