Monday 20 August 2012

మహాత్మా--మన్నించవా--?గాంధీయిజం మరిచి --బ్రాందీఇజం నేర్చుకున్నాము ---

నిద్రాణమై--
నిర్వీర్యమై--నిస్తేజమైన-ఈ -
జాతికి జవజీవాలనిచ్చి --
జాతిపితవైనావు ,
అఖండ భారతాన్ని కలగన్నావు
ఖండఖండాలకు వ్యాపించావు ,
--కానీ --!
బోసి నవ్వు  బాపూజీ --నేటి -
భారతం చూసి --నీ వెడ్వాలి -
బోరుబోరున --
బుర్రకొట్టుకుంటూ -కర్ర విరిగేటట్లు -
" భారతి " కి స్వరాజ్యం --అబలకి స్వేచ్చాజీవితం
నాడు నీవు ఊహించిన ఓ అందమైన -కల
నేడు సంఘం లో అదో వినోద హేల ,
ఆడది అర్ధరాత్రి నడిస్తే --స్వాతంత్రమా ?
అదే ఆడది పట్టపగలు నినదిస్తే --మానభంగమా ?
అహింసా వాది వేమో ? ఆలకించు వీరిమొర --
ఆవేశపడకు --అదే నీవు చేసిన పొరపాటు ,
ఒంటరి ఆడది --
ఎంత సొంపది --ఎంత ఇంపది --ఎంత వంపది -
ఒంటరి ఆడది --
వీడి సొత్తట -- వీడి గుత్తట
ఆడది అడిగిందా ? నగ్నదేహం నడిబజారు పాలట
వీడి తల్లి ఆడది --వీడి చెల్లి ఆడది --ఆలి ఆడది -
నీవిచ్చిన స్వేచ్చ ఏడది ?
పల్లు లేని బాపూ -పల్లు కట్టిచూడు
పల్లు కొరికిచూడు --కల్లు తెరిచిచూడు --
నీ స్వరాజ్యం --రాజకీయ వ్యభిచారకేంద్రం
నీ భారతం --సమస్యల తోరణం -
దిగిరాకు బాపు --దిగిరాకు --దిగావా?
దిక్కులు నిద్రించె సమయం లో --నీక్కూడా --
చుక్కాలు చూపించి పక్కకు తోసేసి-నవ్వు తారు
" గాంధీఇజం " మరిచిపొయాము --
బ్రాందీ ఇజం నేర్చుకున్నాము
అహింసను వదిలి --హింసను పాటిస్తున్నాము
గాంధి వరసులం కాదు --గాంధారి వారసులం
ఇంతకీ --ఇది --
ధర్మమంటావా ? లేక జాతి ఖర్మమంటావా?