Thursday 20 December 2012

విన్నావా తమ్ముడూ --కనలేదిది ఎన్నడూ --? మన మంత్రిగారి ప్రేలాపన ?

విన్నావా తమ్ముడు -
కనలేదిది ఎన్నడూ-
అధికారపు నిషాలో
మత్తెక్కిన మంత్రిగారి --
అవ్యక్త ప్రేలాపన విన్నావా ?
  అధికారపు నిషాలో ,
పదవీకాంత కుషీలో
పాలకులే -ప్రజాసేవకులనే మాట మరచి --
పీడిత ప్రజ వెన్ను విరిచి -
పన్ను మీద --పన్నువేసి
ఖజానాను నింపివేసి .
పొదుపంటూ అదుపు లేని -
పనికిరాని ఖర్చు చేసి ,
రామరాజ్య స్తాపనకై
రాచబాట వేస్తారట --
మన బ్రతుకులు --భవిష్యత్తు
స్వర్గమయం చేస్తారట ---- విన్నావ తమ్ముడూ,
కాల్చే ఆకలితో --కూల్చే వేదనలో
ఆరని ఆవేదనలో --ఆగని రోదనలో
ఎంతకాలమీ నిరీక్షణ్ ?
నిదురించె నీ జాతిని చేయి తట్టి --లేపవోయి
స్వార్ధపరుల కుతంత్రాలు --కుస్టు రాజకీయాలు
కుంభకోనాలు --హవలాలు -దివాలాలు
ఇక మీదట ఆపవోయి ,
నవ సమాజ నిర్మాణం
శ్రామికజన కళ్యాణం
ధన సమాజ నిర్యాణం
ఒకేసారి జరగాలి ,
అణగారిన బ్రతుకులలో
ఆనందం వెల్లి విరియాలి
సమసమాజ  --క్రాంతి రధం
నడవాలిక --క్రాంతి పధం ,


4 comments:

  1. చాలా థాంక్స్ పద్మ గారూ,

    ReplyDelete
  2. చాలా బాగా రాసారు!

    ReplyDelete
    Replies
    1. చాలా థాంక్స్ అండీ,నా బ్లాగ్ సందర్సించినందుూ

      Delete