Thursday 12 April 2012

ఈ ఎడారి లో వసంతం --విరబూసేనా ? ( సరాగ లో ఈ కధ ప్రచురింపబడినది )

కనిపించడం లేదు .అప్పుడప్పుడు వచ్చే టాక్సీలు ,ఆటోల శబ్దం తప్ప. అక్కడే ఆదర్స నగర్లో ,రెండో లైనులో దదాపుసమయం రాత్రి పదకొండు గంటలు కావస్తొంది.నగరానికి కాస్త దూరంగా ఉందేమో ' బోయినపల్లి ', ఎటు వంటి హడావుడి  పది ఎకరాల స్థలం లో కట్టిన ఓ పెద్ద ఆసుపత్రి. ఆసుపత్రి అనే దానికంటే ' ఆశ్రమం ' అంటే బాగుంటుందేమో ? ఆ ప్రశాంత వాతావరణం లో  అవిశ్రాంత సేవలందిస్తున్న ఆ  "మదర్ థెరీసా రీ హేబిటేషన్ అండ్ డెస్టిట్యుటె సెంటర్" మమతానురాగాలు పంచి మానవత్వాన్ని పెంచి ఎందరో అనాధలకు ,అభాగ్యులకు తన ప్రేమామృత హస్తాలతో అక్కున చేర్చుకుని జీవితం ప్రసాదిస్తోంది. బ్రతుకంటే ఆశ కలిగించి అన్ని విధాలా అండగా ఉంటోంది.
హాస్పిటల్ కౌంటెర్ దగ్గర ఇద్దరు కూర్చుని ఎవో రికార్డులు ,రిపోర్టులు చూసుకుంటున్నారు.ఒకరో ఇద్దరో నర్సులు అటు ఇటు తిరుగుతూ అన్ని గదులలో పేషంట్లను పరిశీలిస్తున్నారు .ఆ నిశ్శబ్ద రాజ్యములో అంతా నిదుర పోతున్నారు.కానీ అయిదో అంతస్తులో రూము నంబరు 12 లో ఇంకా లైటు వెలుగుతోంది. ఓ అకారం కిటికీ దగ్గర నిలుచుని చీకటిలోకి చూస్తూ ఏదో ధీర్ఘం గా ఆలోచిస్తోంది ఆ ఆకారం పేరు --సుధా --సుధా మాధురి -!
ఓ వైపు నిశ్శహాయత మరో వైపు బ్రతుకు మీద నిరాశ ! తన ఈ పరిస్తితికి కారణం అన్వేషిస్తోంది. కాళ్ళు నొప్పిగా ఉన్నాయో లేక నీరసమో గాని పక్కనున్న కుర్చీని దగ్గరగా తీసుకుని కూర్చుంది. ఎంతో నేర్పుగా ,ఓర్పుగా అందం గా అల్లుకున్న తన జీవితాన్ని చిందర  వందర చేసేశారు ? ప్రాణం కన్నా తీయనైన తన మధురాను భందాన్ని అసహ్యం గా అవమానించారు.సున్నితమైన తన హృదయ మైదానాలమీద  మేకులు ,బాకులు
దిగ్గొట్టి రాక్షసం గా వికటాట్టహాసం చే్శారు. " నమ్మకం " నట్టేట ముంచేసింది.
రెండు --రెండే రెండు --అక్షరాల మధ్యన 'ఇరుక్కుని ' తన అందమైన జీవితాన్ని తానే పాడు చేసుకొంది. ఆలోచనలు ఎంతకీ తెగడం లేదు.జరిగిన దారుణాన్ని --ఆ --భయంకర అనుభవాన్ని ఎలా
మరచిపోగలదు ? మనిషిని నమ్మి నందుకు మనస్సు ఇచ్చినందుకు ఇంత శిక్ష అనుభవించాలా ? ప్రేమించినందుకు ప్రతిఫలం ఇంత దారుణం గా ఉంటుందా ? ప్రేమంటే కామమేనా? ' శీలం ' అనెది శరీరానికి మాత్రమే సంభందించిందా? మనస్సుకు లేదా? ప్రతీ సారి ఆడదే ఎందుకు ఓడిపోతోంది ? ఎందుకు మోసగింపబడుతోంది ?ఎందుకు బలి అవుతోంది ?
అలా ఆలోచనల పద్మవ్యూహమ్లో ఉంటుండగానే ఒక్కసారి ఉలిక్కిపడింది ,ఏదో గుర్తుకు వచ్చింది కాబోలు.ఏడుపు తన్నుకు వచ్చింది. ఎండి బీటలు వారిన ఆ హృదయం లో ఇంకా నీరు మిగిలేవుందేమో ? కళ్ళు మసక బారాయి.ఓ  కన్నీటి పొర అడ్డం గా నిలుచుంది.మరో కంట్లోంచి కన్నీరు జారిపోతోంది.అలా జారిపోతున్న కన్నీటి చుక్కని ఆపి,ఎందుకే నువ్వు కూడా నన్ను వదిలి పోతున్నావు ? అని అడుగుతూ తనూ --అలా --మెల్లగా --గతం లో కి జారిపోయింది .
  
***
సుధా --ఎలియాస్ --సుధా మాధురి --బి .టెక్ ,సివిల్ ఇంజనీర్.
ఉన్నత వంశం లో పుట్టింది మడులు ,ఆచారాలు ,దైవ భక్తి.అన్నిటికీ మించి సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టింది.ఒక్కగానొక్క కూతురని చాలా గారాబం గా పెంచారు.ఏది కావాలంటే అది వెంటనే
వచ్చేది.చెప్పాలంటే ఓ యువరాణిలా పెరిగింది. నాన్నకు తనంటే చాలా ప్రేమ.  "నువ్వు మా అమ్మవే " అంటూ అల్లారు ముద్దుగా చూసుకునేవారు. కాలేజీ చదివే రొజుల్లో కూడా నాన్నే దిగబెట్టేవారు ,బి .టెక్ ,పూర్తి అయ్యింది.
ఇంట్లో ఉండి ఎం చేస్తావు ?  కాలక్షేపం అవుతుంది అంటూ తన పలుకు బడి ఉపయోగించి ఓ ప్రముఖ కంపనీలో సైట్ ఇంజనీరుగా వేయించారు.
అక్కడే --తన జీవితం మరో మలుపు తిరిగింది --!
ఆరు నెలలు గడిచాక అనుకోకుండా రాకెష్ తో పరిచయం అయింది. అది కూడా కృష్ణ మందిరంలో.అతను కృష్ణ భక్తుడు.చూడటానికి చాలా మంచివాడు గా ఉన్నాడు ,పరిచయం ఏర్పడింది. మాట --మాట
కలిసింది ,అనతి కాలం లో ప్రేమ గా మారింది. అభిరుచులు కలిశాయి. అభిప్రాయాలూ కలిశాయి. తను రాకేష్ మత్తులో పూర్తిగా పడిపోయింది .
ఓ రోజు  "అమ్మా, రాకేష్ చాలా మంచివాడమ్మా. నేను ప్రేమించా పెళ్ళి కూడా చేసుకుంటా" నంది.
అమ్మ చాలా ఆందోళన చెందింది .తరువాత ఆలోచించింది ,నచ్చ చెప్పటానికి ప్రయతించింది ,నీ కేం తక్కువ ? మంచి సంబంధం చూసి చేస్తానంది. కానీ వినలేదు.ఖరాఖండిగా చెప్పేసింది. అతనే జీవితమని అతనితోనే బ్రతుకని.
గట్టిగా మందలిస్తే ఏదన్న అఘాయిత్యం చేసుకుంటుందని భయం వేసింది అయినా అమ్మగా ఓ మాట చెప్పింది!!
సుధా -ప్రేమ పవిత్రమైనదే -మధురమైనదే -పంచుకోతగ్గదే -పెంచుకోదగ్గదే -కానీ "గులాబీని అందుకోవాలని తొందరలో తాపత్రయంలో పొరపాటున ముళ్ళు గుచ్చుకుంటే కారేది మాత్రం రక్తం అని గుర్తుంచుకో? అంటూ జాగ్రత్తలు చెప్పింది. ముసలి చాదస్తమనుకొందో లేక సంపాదిస్తున్నానని గర్వమో తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించసాగింది .
రాకెష్ --ప్రేమన్నాడు --ఈ ప్రేమలోకం లో మనిద్దరమే అన్నాడు --కాస్త కొత్తగా ఉండాలన్నాడు --ఈ అందాలు --ఆనందాలు --మన కోసమే అన్నాడు.
క్లబ్ లకు పబ్ లకూ తీసుకెళ్ళాడు. ప్రేమంటే ఓ మత్తు --ఓ మైకం -పూర్తిగా అతని వశమైపోయింది. వాస్తవాన్ని గుర్తించక  హద్దులు దాటేసింది. ప్రపంచం ఎంత అందంగా ఉంది? అది కూడా తను ఉంటేనే!!
అమ్మా,నాన్నా,ఆఫీసు, అన్నింటికన్నా తనకే ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చింది. అనుకున్నట్లు అంతా జరిగితే అది ' జీవితం '  ఎందుకవుతుంది? జీవితం ముళ్ళబాట లోనూ ఉంటుంది. పూల బాట లోనూ
ఉంటుంది. పరిస్థితులను బట్టి గమ్యం నిర్దేసించుకునేవాడే మనిషి .
ఆ రోజు అక్తోబరు 4. జీవితం లో మరిచిపోని,మరువలేని రోజు.అత్యంత భయంకర అనుభవాన్ని చవిచూసిన రోజు.జీవితం తల క్రిదులైన రోజు.ఆశల సౌధం కుప్పకూలిన రోజు.మనిషిగా మరణించిన రోజు --!?
ప్రమోషను వచ్చింది, పార్టీ ఇస్తున్నాను గండిపేటలో అన్నాడు.
అమ్మకి చెప్పింది. "అమ్మ గండిపేట లో పార్టీకి వెళుతున్న"  కొంచం నాన్నకి తెలియ కుండా మేనేజ్ చెయ్యవా అంది. అతనితో వెల్లిపోయింది. ఆమె జవాబు కోసం ఎదురుచూడ కుండానే!!
చలా చక్కగా ఏర్పాటు చేసాడు.  మనతో పాటు మరికొందరు ఫ్రెండ్స్ వస్తారు అంటే సరేనంది. అందరిలా మనం ఉండకూడదు కొందరిలా ఉండాలన్నాడు! గ్లాసు తో కాక్తైల్ కలిపి ఇచ్చాడు.మొహమాట పడుతునే
అందుకుంది. నమ్మకం రాకేష్ తన మనిషి ,తన స్వంతం,తనకు కాబోయే భర్త కూడా!!!
 అడ్డు చెప్పలేక పోయింది. తాగింది --కొంచం --కొంచం --గా--ఏదో -- మత్తు --ఏదో మైకం --ఒళ్ళంతా --తూలిపోతున్నట్లుగా ఉంది. అప్పుడు చూసింది తనతో పాటు మరికొందరిని?
అంత మత్తులో మనస్సు ఏదో కీడు శంకించింది. వాళ్ళ ప్రవర్తన అనుమానంగా తోచింది. పూర్తిగా తెలుసుకునేలోపలే దారుణం గా చిక్కి  పోయింది. ప్రతిఘటించే శక్తి లేదు. లొంగి
పోయింది.లేదు లేదు లొంగ దీసుకున్నారు ? ఒకరి తరువాత ఒకరు.  ట్రైను కైతే ఎన్ని బోగీ లు ఉంటాయో లెక్కగా చెప్పవచ్చు కానీ గూడ్సు కో ? ఆ శరీరం పై ఎన్ని గూడ్సులు వెళ్ళాయో తెలుసుకునేలోపల నిర్వీర్యం గా నిస్తేజం గా పడిపోయింది. కళ్ళు తెరిచేసరికి బ్రతికి ఉన్నాననుకొంది.

ఇదిగో ఇక్కడ ఇలా హాస్పిటల్ లో!! ఎదురుగ డాక్టరు కాశీనాధ్. పక్కనే తన మేనేజరు -విశ్వరూప్.
***
      
దాదాపు రెండు నెలలకు గానీ కోలుకోలేదు.  విశ్వ రోజూ వచ్చేవాడు దగ్గరుండీ అంతా తానే చూసుకునేవాడు. ఓ రోజు అడిగింది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను ? ఎవరు తెచ్చారు ? ఎన్ని
రోజులైంది / ఇంకెన్నాళ్ళు ఉండాలి ? దయచేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అంటూ ప్రాధేయపడింది.
సుధా నువ్వు పూర్తిగా కోలుకోవాలి. మళ్ళీ మునపటి స్తితిలోకి రావాలి. జరిగినదానికి భాధ పడుతూ కూర్చుంటే లాభం లేదు. చక్కగా ధైర్యం నూరిపోస్తున్నాడు. మళ్ళీ జీవితం మీద ఆశ,ఆసక్తి
కలిగిస్తున్నాడు.ఆశ్చర్యం ఎమిటంటే గతం గురిచి ఎమీ మాటలాడలేదు.డాక్టరు చెప్పినట్లు గా చక్కగా కౌన్సిలింగు చేస్తున్నాడు.దారుణమైన స్థితిలో కన్న కూతుర్ని చూసిన ఆ తల్లి తండ్రులు లేరని తిరిగిరాని లోకాలకు చేరారని విశ్వ చెప్పలేదు.చెప్పడు కూడా!!
అతని ధ్యేయం ఆమె కోలుకోవాలి. మళ్ళీ మనిషిగా బ్ర్తతకాలి. గతం మరచిపోవాలి!
  ***
ఏదో శబ్దం వినిపించింది.గభాలున లేచి నిలుచుని ద్వారం దగ్గరకు వెళ్ళింది ,గతం లోనుంచి బైటకు వచ్చింది. చాలా రాత్రి అయింది పడుకోవాలమ్మా అంటూ మాత్రలు మంచినీరు ఇచ్చి ఆమె వేసుకున్న తరువాత వెళ్ళిపోయింది నర్సు అనసూయ.
మందులు వేసుకుని మెల్లగా మంచం దగ్గరకు చేరింది. విశ్వ చెప్పినట్లుగా  హృదయం అన్నాక గాయం కాకుండా ఉంటుందా ? జీవితం అన్నాక ప్రయాణం ఆగిపోతుందా?
చీకట్లను చీల్చుకుంటూ వచ్చే ఉగాది ఉషస్సు ల కోసం వేచి చూస్తూ  అలా నిద్ర లోకి జారిపోయింది సుధ.
         



Wednesday 11 April 2012

ఆడదంటే----!? నాకు తెలుసు -! మీకు తెలుసా ?

ఆడదంటే --అర్ధం --పరమార్ధం
ఆడదంటే --అందం --ఆనందం
ఆడదంటే --ఆత్మీయత --అభిమానం
ఆడదంటే --అనురాగం --అనుబంధం
ఆడదంటే --సహనం --సంతోషం
ఆడదంటే --అంబరం --అగాధం
ఆడదంటే --సమూలం --అమూల్యం
---చదవాలే గానీ--
అంతకు మించిన పుస్తకం ఏదీ--?
---నడవాలే గానీ --
అంతకు  మించిన దారేదీ --?
--కాకపోతే -
అక్కడక్క డ --మరకలు --మచ్చలు --చెదలు --చీడలు
అప్పుడప్పుదు --గుంతలు --గుంటలు  --రాళ్ళు --ముళ్ళు
నిజం సుమీ --నేనన్నది
నా మాటే నిజం కాకపోతే
నడుస్తున్న చరిత్ర ని అడుగు
సీత --సావిత్రి --రజియ --జిజియా లను
పరిచయం చేసింది --
మా అమ్మ --మీ అమ్మ -- వాళ్లమ్మ లను
ప్రసాదించింది --
ఆ చరిత్రే --కొన్ని పేజీలలో -
నీరా రాడియా --తారా చౌదరీ --థనూ --అనూలను --
చొటు ఇచ్చింది --
అవునా ? కాదా ?
అవునంటే అటు చూడు
అదిగో చంద్రుని మీద " మచ్చ "
ఇది అభినవ మానవేంద్రుని "రచ్చ "