Monday 29 July 2013

చితి మంటల వెలుగులో ----అభి " మాన " భంగమే ? (అమ్మ , అక్క ఏడుస్తుంటే --నన్ను ఎవరు ఓదారుస్తారు ?

హమ్మయ్య --:
ఓ సమస్య తీరింది
మొత్తానికి
అనుకున్నది జరిగింది
' తాంబూలాలు ' ఇచ్చేసాము ---ఇక
తన్నుకు చావండి =
సరిగ్గా ---66 సం =రాల క్రితం
ఇలాగే -- ఈ విధంగానే
" అమ్మ ' ని
ముక్కలు --ముక్కలు గా చేసేసారు
పంచుకున్నారు --కావలసిందంతా
దండుకున్నారు
అమ్మ ముసలి ది అయిందని కాబోలు --ఇప్పుడు
అక్కని --ఎంచుకున్నారు
చక్కగా --చీల్చేస్తున్నారు ,
గంగా -గోదావరి కన్నీల్లు  ఎవరికి కావాలి
హృదయ  మైదానాలు మాత్రం కావాలి
అమ్మయినా --అక్కయినా --వారి కి ఎందుకు ?
ఆస్తి --అధికారమే వారికి కావాలి
అమ్మా --ఏడవకే
అక్కా ఎడవకే --
నాన్న లేడనే కదా వాళ్ళు విర్రవీగుతున్నారు --( ఆలోచించేవాడు )
అన్న రాడనే కదా వాళ్ళు --రెచ్చిపోతున్నారు --( ఆవేశపడేవావాడు )
బ్రతికుండగానే --పోస్తు మార్టం చేస్తూ
చితి వెలుగులో ---చిద్విలాసం గా --పా్ర్టీ చేసుకుంటున్నాడు
మతి పోయి --భారతి --మౌనంగా
గతి లేక --అన్నపూర్ణ --ఆవేదనగా
జాతి మొత్తం --జవజీవాలు కోల్పోతున్న
పట్టించుకోకుండా
ఓట్ల కోసం ---సీట్ల కోసం --నోట్ల కోసం
పదవి కోసం --పరువు కోసం --పంతం కోసం
హృదయ శిధిలాల మీద నడచుకుంటూ వెళ్ళిపోతున్నాడే
వారిని ఏమని పిలవాలి ? ఎం అనాలి ?
ఏ జాతి వాడని అదగాలి ? " నాలుగో " జాతి అందామా ?
లేక మనం నోరు మూసుకుందామా ?
మరేమి చెయ్యగలం ?
కళ్ళున్న గుడ్డివాళ్ళం ---చెవులున్న చెవిటి వాళ్ళం
నోరున్న మూగ వాళ్ళం --బలమున్న --బలహీనులం్
చదువున్న నిరక్ష్య రాసులం -- వెరసి 
ప్రజాస్వామ్యం లో ---
ఓడిపోయిన ఓ ట రు లం --.

1 comment:

  1. గల్లీవీరులం
    ఢిల్లీదాసులం

    ReplyDelete