Wednesday 11 April 2012

ఆడదంటే----!? నాకు తెలుసు -! మీకు తెలుసా ?

ఆడదంటే --అర్ధం --పరమార్ధం
ఆడదంటే --అందం --ఆనందం
ఆడదంటే --ఆత్మీయత --అభిమానం
ఆడదంటే --అనురాగం --అనుబంధం
ఆడదంటే --సహనం --సంతోషం
ఆడదంటే --అంబరం --అగాధం
ఆడదంటే --సమూలం --అమూల్యం
---చదవాలే గానీ--
అంతకు మించిన పుస్తకం ఏదీ--?
---నడవాలే గానీ --
అంతకు  మించిన దారేదీ --?
--కాకపోతే -
అక్కడక్క డ --మరకలు --మచ్చలు --చెదలు --చీడలు
అప్పుడప్పుదు --గుంతలు --గుంటలు  --రాళ్ళు --ముళ్ళు
నిజం సుమీ --నేనన్నది
నా మాటే నిజం కాకపోతే
నడుస్తున్న చరిత్ర ని అడుగు
సీత --సావిత్రి --రజియ --జిజియా లను
పరిచయం చేసింది --
మా అమ్మ --మీ అమ్మ -- వాళ్లమ్మ లను
ప్రసాదించింది --
ఆ చరిత్రే --కొన్ని పేజీలలో -
నీరా రాడియా --తారా చౌదరీ --థనూ --అనూలను --
చొటు ఇచ్చింది --
అవునా ? కాదా ?
అవునంటే అటు చూడు
అదిగో చంద్రుని మీద " మచ్చ "
ఇది అభినవ మానవేంద్రుని "రచ్చ "

11 comments:

  1. మందాకిని గారు, చాలా బాగుందండి. ఇలాగే మొగవాళ్ళ గురించి కూడా చెప్పొచ్చనుకుంట:)

    ReplyDelete
    Replies
    1. Jaya gaaru ,naablaag sandarsinchinanduku chaalaa dhanyavaadaalu,intakumundu okasaari mogavaallameeda kuuda vrasaanu ,adi kudaa twaraloa blaag loa pedataanu ,mee proatsaahaaniki marokkasaaridhanyavaadaalu

      Delete
  2. చాలా బాగుంది. . ఇంత బాగా చెప్పినందుకు ధన్యవాదములు.

    ReplyDelete
  3. బ్లాగ్ ఓనర్ రోహిణి గారికి,
    ఒక చిన్న మనవి.
    మూడేళ్ళకు పైగా మందాకిని అనే పేరుతో నేను బ్లాగ్ వ్రాస్తున్నాను.
    మీకు తెలుసో లేదో నాకు తెలీదు.
    mandaakini.blogspot.in
    ఇది నా బ్లాగ్ యు ఆర్ ఎల్.
    మీకు అభ్యంతరం లేకపోతే మీ బ్లాగ్ కు కొత్తపేరు పెట్టుకోగలరు. ఇది నా మనవి మాత్రమే. లేదు ఇదే కొనసాగిస్తాను అంటే నేను చేసేది ఏమీ లేదు.
    ఈ వ్యాఖ్యను ప్రచురించగలరు. కనీసం మనిద్దరివీ వేరు వేరు బ్లాగ్ లని కొంతమందికైనా తెలుస్తుంది.
    ధన్యవాదాలు.
    (మందాకిని) లక్ష్మీదేవి.

    జయ గారు,
    ఈ బ్లాగ్ నాది కాదు. గమనించగలరు.
    (మందాకిని) లక్ష్మీదేవి.

    ReplyDelete
  4. రోహిణి గారు, మీ బ్లాగ్ పేరు అక్షరసమరం అని కనిపిస్తోంది.
    మీ పోస్ట్ లకు తగిన పేరు ఎంచుకున్నారు.
    అగ్రిగేటర్ లో మందాకినీ అనే పేరు చూసి వ్యాఖ్య వ్రాశాను.
    సారీ.

    ReplyDelete
  5. బాగా చెప్పారండీ!

    ReplyDelete
  6. Lakshmidevi gaaru namastea,neanu kottagaa blaag loakaaniki parichayam ayyyaanu,teliyaka mundu mandaakini pearu pettaanu ,mee blaagu chuusaaka ventanea maarchaanu ,haaram sampaadakulaku kuuda teliyaparichaanu,naa valana kaligina asoukaryaaniki chintistunnaanu ,naa pearu maarustaanu ,naablaag darsinchinanduku dhanyavaadamulu,naa blaag pearu aksharasamaram ,koodali,sankalini loa vastundi,twaraloa maarutundi ,thanks

    ReplyDelete
  7. Rasajnagaaru dhanyavaadaalandi

    ReplyDelete
  8. రోహిణి గారు,
    పాజిటివ్ గా స్పందించినందుకు, ఓపిగ్గా వివరించినందుకు మీకు అనేక ధన్యవాదాలు.
    హారం లో పేరు మార్చినా కూడా పాతపేరే వస్తుంటుంది. అక్కడ పేరు చూసి, జయగారి వ్యాఖ్యని క్లిక్ చేసి వెంటనే వ్యాఖ్య ఫారంలో వ్రాసేసి ప్రచురించాక పైన చూస్తే పేరు కొత్తది కనిపించింది. తొందరపడి వ్రాసినందుకే సారీ చెపుతూ ఇంకో వ్యాఖ్య వ్రాశాను.
    మిగతా కూడలి మొ.వాటిలో గమనించాను. కొత్తపేరు వస్తున్నది.
    సారీ యగైన్.

    ReplyDelete
  9. మందాకిని గారు నేను కూడా సారీ. మీరు మంచి కవయిత్రి అని నాకు తెలుసు. రోహిణి గారు, నా కన్ ఫ్యూజన్ కు సారీ. మీ రచన కూడా చాలా బాగుంది. అందులో సందేహం లేదు. త్వరలోనే మందాకిని గారి లాగా మంచి పద్యాలు వ్రాయండి. All the best.

    ReplyDelete