Tuesday 27 March 2012

మౌన రాగమా--లేక మనోగానమా ? ఏం చెయ్యను ?

వేదాంతం మాట్లాడితే
ఈ సమాజం -చేతకానివాడంది ,
నిజాయితీగా మాటలాడితే -
స్వార్ధం అంది ,
మెత్తగా మాటలాడితే
మోసం అంది ,
కటువుగా మాటలాదితే
కసాయి తనం అంది --
అందుకే --
మూగ వానిగా పుడితే -బాగుండును అనిపిస్తోంది ,
కానీ ---
ఈ కళ్ళున్న మనస్సు --ఊరుకోవడం లేదే -
ఏం చెయ్యను -ఎలా చెయ్యను ?

2 comments:

  1. నొప్పింపక, తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నారు అందుకే!

    ReplyDelete
  2. తప్పకుండా స్పందించాల్సిన వాటికి స్పందించక పోవడం నేరమే సార్..అందుకే వీలైనంతగా స్పందించండి..బాగుంది పోస్ట్..

    ReplyDelete